26.3 C
Hyderabad
Monday, August 3, 2026

ఉప విద్యాశాఖ అధికారులను నియమించాలి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : జిల్లాలో ఖాళీగా ఉన్న ఉప విద్యాశాఖ అధికారులను వెంటనే సీనియర్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు వెన్నిగల సురేష్ డిమాండ్ చేశారు. దీనివల్ల ఉన్నత పాఠశాలలో నెలకొన్న సమస్యలు తొలిగే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం ఇటీవల నియమించిన మండల  విద్యాశాఖ అధికారుల అదనపు బాధ్యతలను సీనియర్ ప్రధానోపాధ్యయులకు ఇవ్వాలని అన్నారు. సీనియర్లను పక్కన పెట్టి వివిధ కారణాలతో ఎంఎన్ఓలకు మండల విద్యాశాఖ అధికారిగా నియమించడం సమంజసం కాదన్నారు. దీనివల్ల మండలంలోని ఉపాధ్యాయుల మధ్య అంతరాలు ఏర్పడే అవకాశం ఉందన్నారు.

More articles

Latest article