. . . తెయూ ఎగ్జిక్యూటివ్ మెంబర్ (ఈసీ)గా ఎంపికైన డా.దండు స్వామి
నిజామాబాద్ సిటి, బతుకమ్మ:
తెలంగాణ యూనివర్సిటీ పాలక మండలి సభ్యునిగా జీజీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ దండుస్వామి ఎంపిక అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి డా. యోగితా రాణా తెయూ పాలకమండి సభ్యుల నియమాకం ఉత్తర్వులను గురువారం విడుధల చేశారు. తెయూ ఎగ్జిక్యూటివ్ మెంబర్ (ఈసీ)గా ఎంపికైన డా.దండు స్వామి తెలంగాణ యూనివర్సిటీ ఉపకులపతి యాదగిరిరావు,రిజిస్టర్ యాదగిరిలను శుక్రవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ జిజి కాలేజీలో జి.సి. టి.ఏ. సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యాపకులు దండు స్వామిని ఘనంగా సన్మానించారు. గిరిరాజ్ ప్రిన్సిపాల్ ఆచార్య పి.రామ్ మోహన్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ఎస్. రంగరత్నం, సంఘం అధ్యక్షులు లింగన్న, అధ్యాపకులు రామస్వామి,పెద్దన్న, అంబర్ సింగ్, ముత్తెన్న, సతీష్, బాబురావు, జయప్రసాద్, భరత్ రాజ్ లు దండు స్వామీకి శుభాకాంక్షలు తెలిపారు.

