నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
గిరిరాజ్ కళాశాలలో పదోన్నతి పొందిన ప్రొఫెసర్లకు బుధవారం స్టాఫ్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ పి. రామ్మోహన్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ఎస్.రంగరత్నం, ఫిజికల్ డైరెక్టర్ బాలమణి ప్రొఫెసర్లుగా పదోన్నతి పొందారు. డా.ఉమా కిరణ్ (బోటనీ), డా.ఏ.రాజేశ్ (కెమిస్ట్రీ), డా.చంద్రశేఖర్ (మైక్రోబయాలజీ) అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతి పొందారు. ఇటీవల పీ హెచ్ డి పట్టా పొందిన అధ్యాపకులు డా.ఏ.సుమన్, డా.ఎం.శ్రీలేఖ, డా.బి.దీపక్ లను సన్మానించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ… కళాశాల అధ్యాపకులు ఎన్నో అర్హతలు సంపాదించి, ఇక్కడ చక్కటి బోధన చేయడం కళాశాలకు మంచి పేరు తెస్తుందని అధ్యాపకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ క్లబ్ కోఆర్డినేటర్ డా.రంజిత, పి.ఆర్.ఓ. దండు స్వామి, పరీక్షల నియంత్రణ అధికారి భరత్ రాజ్, ఎన్ సిసి అధికారి రామస్వామి, అకాడమిక్ కోఆర్డినేటర్ నాహీదా బేగం, ఏవో.రామ్ కిషన్, సూపరిండెంట్ ఉదయభాస్కర్, అధ్యాపకులు రమణ, ముత్తెన్న, జయప్రసాద్, వినయ్ కుమార్, పూర్ణచంద్ర రావు, విద్యార్థులు, ఎన్.సి.సి. క్యాడెట్లు తదితరులు పాల్గొన్నారు.
