27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎల్ఆర్ఎస్. సర్వే ను పక్కాగా నిర్వహించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • కామారెడ్జి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
  • డంపింగ్ యార్డ్ నిర్వహణ సరిగా లేదని ఎంపీ ఓ ఈవోకు నోటీసులు

బతుకమ్మ పిట్లం :  ఎల్.ఆర్.ఎస్. సర్వే ను పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం రోజున పిట్లం మండల కేంద్రంలో కొనసాగుతున్న ఎల్.ఆర్.ఎస్. తీరును కలెక్టర్ పరిశీలించారు. అనంతరం కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలిస్తూ, రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఏ.ఎన్.సి. సెంటర్ రిజిస్టర్ లను పరిశీలించారు. స్టార్స్ ను తనిఖీ చేస్తూ మందులను సక్రమంగా పంపిణీ చేయాలని, పనికిరాని ఎక్విప్మెంట్ లను తీసివేయాలన్నారు. లాబరేటరీ లో చేస్తున్న పరీక్షలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో టాయిలెట్స్ లేని కారణంగా సిబ్బందికి ఇబ్బందులు కలుగుతున్నాయని డాక్టర్లు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్ సూచించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయం లోని ప్రజా పాలన కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. అనంతరం డంపింగ్ యార్డ్ ను పరిశీలించి నిర్వహణ సరిగా లేదని, ఇంటింటి చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్ కు తరలించి సెగ్రిగేషన్ చేయాలన్నారు. డంపింగ్ యార్డ్ నిర్వహణ సక్రమంగా లేనందున ఏం. పి. ఒ., పంచాయతీ కార్యదర్శి లకు నోటీసు జారీ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డా. రవీంద్ర కుమార్, డా. విజయ లక్ష్మి, మండల పరిషత్ అధికారి వి.కమలాకర్, తహసీల్దార్ వేణుగోపాల్, ఆయా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

LRS survey should be conducted properly

More articles

Latest article