. . . నియమాక పత్రం అంద చేసిన మాజీ మంత్రి సుధర్శన్ రెడ్డి
నిజామాబాద్ , బతుకమ్మ:
నిజామాబాద్ జిల్లా గ్రంథలయ సంస్థ చైర్మెన్ అంతరెడ్డి రాజారెడ్డి నియమితులు అయ్యారు. జిల్లా కు చెందిన అంతరెడ్డి రాజారెడ్డిని డిసిఎల్ చైర్మెన్ గా నియమిస్తు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెంకటేశం ఉత్తర్వులు బుదవారం జారీ చేశారు. ఈ మేరకు మాజీ మంత్రి, బోదన్ శాసన సభ్యులు పొద్ధుటూరి సుధర్శన్ రెడ్డి గురువారం నియమాక పత్రాన్ని రాజారెడ్డికి అందచేశారు. నిజామాబాద్ నగరంకు చెందిన రాజారెడ్డి 1981 -82 మద్య కాలంలో నిజామాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యక్షులుగా పని చేశారు. 1989 నుంచి95 వరకు డిసిసి ఉపాధ్యక్షునిగా ఉన్నారు. 1992-95 వరకు నిజామాబాద్ పిఎసీఎస్ కు చైర్మెన్ గా 1992 నుంచి 2005 వరకు డిసీసీబి డైరెక్టర్ గా పని చేశారు. 1997 నుంచి 2004 వరకు సర్వ సమాజ్ సలహదారుగా ,1997 నుంచి 2004 వరకు నగర కాంగ్రెస్ అధ్యక్షులుగా పని చేశారు. 2011 నుంచి ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నారు. సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ లో ఉండి, మాజీ మంత్రి సుధర్శన్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉన్నంధుకే జిల్లా గ్రంథలయ సంస్థ చైర్మెన్ గా నియమించారు. జిల్లా గ్రంథలయ సంస్థ చైర్మెన్ గా తనను నియమించినంధుకు అంతరెడ్డి రాజారెడ్డి ఈ మేరకు సీయం రేవంత్ రెడ్డితో పాటు బోదన్ ఎమ్మెల్యే సుధర్శన్ రెడ్డికి, జిల్లా కాంగ్రెస్ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.

