24.1 C
Hyderabad
Monday, August 3, 2026

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేస్తాం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . టీఎస్ యుటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి డి.సత్యానంద్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి శాయశక్తులా కృషి చేస్తామని, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేస్తామని టీఎస్ యుటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి డి.సత్యానంద్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యుటీఎఫ్) 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా మంగళవారం జిల్లా కేంద్రంలో టీఎస్ యుటీఎఫ్ పతాకాన్ని ఆవిష్కరించారు.

 

We will organize movements to solve teacher problems.

 

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో1974 లో ఏపీయుటీఎఫ్ ఏర్పడిందని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత టీఎస్ యుటీఎఫ్ గా ఆవిర్భావం చెందిందని అన్నారు. అధ్యయనం, అధ్యాపనం, సామాజిక స్పృహ, హక్కులు, బాధ్యతలు రెండు నేత్రాలు అనే ఆశయాలతో పనిచేస్తూ, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు, అన్ని మేనేజ్ మెంట్ల ఉపాధ్యాయుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జి.గంగాధర్, ట్రెజరర్ ఎన్.రాజారామ్, జిల్లా కార్యదర్శులు వి.సాయన్న, జి.ఆనందం, ఈ.శ్రీనివాస్, సొన్ పేట్ గంగాధర్, జిల్లా కమిటీ సభ్యులు టి.లింగన్న, ఎమ్.బాజన్న, టి.కపిల్ దేవ్, సీనియర్ ఉపాధ్యాయులు శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

More articles

Latest article