. . . మోహన్ భగవత్
బోధన్, బతుకమ్మ :
భవిష్యత్‌లో హిందూ సమాజం జాగృతం కాకపోతే బానిసత్వం తప్పదని ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ బలిరాం పంత్ హెడ్గేవార్ భావించారని, దీంతో హిందువుల్లో చైతన్యం కోసం ఆర్ఎస్ఎస్ను స్థాపించారని మోహన్ భగవత్ తెలిపారు. కందకుర్తి లో శ్రీ కేశవ స్పూర్తి మందిర్ ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోహన్ భగవత్ మాట్లాడుతూ హిందూ సమాజాన్ని ఆదర్శంగా మార్చడానికి హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్ ను ఏర్పాటు చేశారన్నారు. నేడు ఆయన చూపిన మార్గంలో ఎంతోమంది నడుస్తున్నారని చెప్పారు. హెడ్గేవర్‌కు కందకుర్తి నుంచి సేవా భావం, దేశ భక్తి వచ్చాయన్నారు.

కందకుర్తిలోని మట్టిలో సైతం హెడ్గేవార్ స్ఫూర్తి ఉందన్నారు. నేడు ఆయన చూపిన మార్గంలో స్ఫూర్తి మందిరం ఏర్పాటు చేసుకున్నామని, భవిష్యత్‌లో ఆయన ఆశయ సాధనకు ముందుకు సాగాలని సూచించారు. గరుడ్మంతుడు స్వర్గానికి వెళ్లి అమృతం తెచ్చి తన తల్లిని బానిసత్వం నుంచి విముక్తి చేశారని మోహన్ భగవత్ తెలిపారు. అనంతరం ఆ అమృతాన్ని తిరిగి తీసుకెళ్లి ఇంద్రుడికి ఇచ్చారని చెప్పారు. తన కోసం అమృతం తేలేదని, తల్లిని బానిసత్వం నుంచి విడిపించాడనికి తెచ్చాడని చెప్పారు. హెడ్గేవార్ సైతం తల్లి భారతమాతను దాస్య శృంఖాలల నుంచి విడిపించడానికి ఆర్ఎస్ఎస్ను ఏర్పాటు చేశారన్నారు. బ్రిటిష్ వాళ్లకంటే ముందు ఎంతో మందిని విదేశీయులు భారత్‌ను పాలించారన్నారు. హిందువులు ఏకంగా లేకపోవడంతోనే ఇది జరిగిందన్నారు.

. . . పట్టిష్టమైన పోలీసు భద్రత
మోహన్ భగవత్ పర్యటన సందర్భంగా పోలీస్‌శాఖ పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. కేంద్ర పారా మిలటరీ, రాష్ట్రస్థాయి బలగాలు, 6 క్యూఆర్టీ బృందాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీపీ సాయిచైతన్య ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, రాకేష్‌రెడ్డి, వెంకట రమణారెడ్డి, రామారావు పటేల్, కందకుర్తి సర్పంచ్ గియాజుద్దీన్, ఆర్ఎస్ఎస్ ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం స్మృతి వనం నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన అందరిని సన్మానించారు. సహకరించిన దాతలు, నిర్మాణంలో సాయం చేసిన వారు, స్థపతి, డిజైన్ చేసిన వారు, నిర్మాణ పనులు చేపట్టిన మేస్త్రీలను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సన్మానించారు.

. . . కేశవ స్పూర్తి మందిర్ ను ప్రారంభించిన మోహన్ భగవత్
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంని ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ బలిరాం పంత్ హెడ్గేవార్ పూర్వికుల గ్రామం కంధకుర్తిలో నిర్మించిన శ్రీ కేశవ స్పూర్తి మందిర్ జాతీకి అంకీతం అయింది. శనివారం సాయంత్రం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ డాక్టర్ మోహన్ రావు భగవత్ ప్రారంభించారు. అంతకు ముందు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు ఆర్ఎస్ఎస్ ప్రముఖ్ లు స్వాగతం పలికారు. ఈ సంధర్బంగా స్ధానికంగా ఆలయాలలో పూజలను నిర్వహించిన ఆనంతరం కేశవ సేవా సమీతి నిర్మించిన కేశవ స్పూర్తి మందిరం ను ప్రారంభించారు.

అనంతరం స్పూర్తి మందిరంలో ఉన్న భారత మాత పోటోకు పూల మాలను వేసిన ఆనంతరం పోటో గ్యాలరీని సంధర్శించారు. కార్యక్రమంలో కేశవ స్పూర్తి మందిరం అధ్యక్షులు చామకుర సుధాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

