26.3 C
Hyderabad
Monday, August 3, 2026

బిజేపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారీ అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

 

. . .  బహిరంగ చర్చకు వాడి పెద్ధమ్మగుడికి వచ్చిన బిజేపి నాయకులు

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో గతంలో అకాల వర్షాల కారణంగా వందల ఎకరాలలో పంట నష్టం వాటిల్లిందని దానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత పరిహరం ఇచ్చింది, దానికి ఆదారాలతో సహ బహిరంగ చర్చకు రావాలన్న బిజేపి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ధర్పల్లి మండలం వాడి గ్రామంలో బహిరంగ చర్చకు రావాలని ఇటివల బిజేపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారీ, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డికి సవాల్ విసిరారు. ప్రభుత్వం రైతులకు పరిహరం ఇచ్చి అదుకుందని ఎమ్మెల్యే కౌంటర్ ఇవ్వడంతో శనివారం వాడి పెద్ధమ్మగుడి వద్ధకు చర్చకు రావాలని సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రూరల్ నియోజకవర్గంలో పోలిసులు బిజేపి నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. బిజేపి జిల్లా అధ్యక్షుడు దినేష్ సైతం కారును పక్కన పెట్టి బైక్ పై వాడికి చెరుకున్నారు. అక్కడ దినేష్ మీడియాతో మాట్లాడుతూ… రైతుల కష్టాలను రాజకీయ లబ్ధికోసం వాడుకోవడం కాంగ్రెస్ పార్టికి వెన్నుతో పెట్టిన విద్యా అన్నారు. ప్రభుత్వం గతంలోనే రైతులకు పరిహరం ఇస్తే ఆదారాలు ఎవని అడుగడం తప్పా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పాలనకు ప్రజలు త్వరలో ముగింపు పలుకుతారని అన్నారు. రైతులకు న్యాయం కోసం బిజేపి పోరాడుతుందని అన్నారు. ఈ సందర్బంగా బిజేపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారీని పోలీసులు అరెస్టు చేసి మోపాల్ పోలిస్ స్టేషన్ కు తరలించారు.

More articles

Latest article