24.7 C
Hyderabad
Monday, August 3, 2026

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

 

మోర్తాడ్, బతుకమ్మ :

 

ఆరుగాలం రైతులు కష్టపడి పండించిన ధాన్యం దళారుల పాలు కాకుండా రైతుకే లాభాలు వచ్చే విధంగా ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఐకెపి ఏపిఎం గంగాధార్ అన్నారు. మోర్తాడ్ మండలంలోని సుంకేట్, మోర్తాడ్ మండల కేంద్రంలో, వడ్యట్ మూడు గ్రామాల్లో శనివారం వరి కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరసయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముత్యాల రాములు, ఐకెపి సీసీలు తడకల శ్రీనివాస్, మహేందర్, గాజుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

 

Take advantage of shopping centers

More articles

Latest article