31.7 C
Hyderabad

ఘనంగా మహాత్మ జ్యోతిబా పూలే జయంతి వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మహాత్మ జ్యోతిబా పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. అనంతరం జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్యోతిబా పూలే సమాజంలో సమానత్వం నెలకొల్పేందుకు, విద్యా విస్తరణకు చేసిన కృషి అమూల్యమని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళల విద్యాభివృద్ధికి ఆయన చేసిన సేవలు భారత చరిత్రలో చిరస్మరణీయమని అన్నారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని, ప్రతి విద్యార్థి పూలే ఆలోచనలను ఆచరణలో పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యులు పిట్ల శ్రీధర్, ఎజాస్, దాసరి శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్లు ఖాలేక్, హకీమ్, లాయఖ్, నాయకులు కాసుల రోహిత్, అధ్యాపకులు స్వరూప్, జూనియర్ అసిస్టెంట్ అబ్దుల్ రజాక్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article