29 C
Hyderabad
Monday, August 3, 2026

జ్యోతిబా పూలే స్ఫూర్తితో దేశంలో కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . పీడీఎస్ యు నిజామాబాద్ నగర అధ్యక్షులు సిర్రం పవన్ కుమార్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

జ్యోతిబాపూలే పోరాటస్ఫూర్తితో విద్యారంగ సమస్యల పరిష్కారానికై, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పీడీఎస్ యు నిజామాబాద్ నగర అధ్యక్షులు సిర్రం పవన్ కుమార్ పిలుపునిచ్చారు. పిడిఎస్ యూ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో జ్యోతిబాపూలే 200 వ జయంతి సందర్భంగా నగరంలో ప్రభుత్వ ఆనంద నిలయం సంక్షేమ హాస్టల్ లో శనివారం జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జ్యోతిబాపూలే ఈ దేశంలో అందరికీ విద్య అందాలనే ఉద్దేశంలో సావిత్రిబాయి పూలే కు విద్యను నేర్పి దళిత పేద బడుగు వర్గాలకు విద్యను నేర్పే విధంగా కృషి చేశారని, వివక్షతలు లేని సమాజం కోసం అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర నాయకులు శ్రీకర్,క్రిష్, రాజేష్ , వంశి, ఇవా, ప్రవీణ్ ,చరణ్ ,సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article