. . . అంబులెన్స్ డ్రైవర్ తో పాటు పెషేంట్ మృతి
. . . జాతీయ రహదారిపై రామేశ్వర్ పల్లి వద్ద ఘటన
బిక్కనూర్, బతుకమ్మ:
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రామేశ్వరం పల్లి వద్ద అంబులెన్స్ ను ప్రైవేట్ టూరిస్ట్ బస్ ఢీకొట్టింది. ఈ సంఘటన శుక్రవారం అర్ధరాత్రి జాతీయ రహదారి 44 పై జరిగింది. ఈ ఘటనలో అంబులెన్స్ డ్రైవర్ తో సహా పేషెంట్ మృతి చెందగా పేషేంట్ భర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి.. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.ఆదిలాబాద్ కు చెందిన సలేహ భాను(60) ఇటీవల తీవ్ర అనారోగ్యం బారిన పడింది. హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పోందగా కోలుకుంది. సలేహ భాను భర్త సైఫుల్లా ఖాన్ ప్రైవేట్ అంబులెన్స్ లో శుక్రవారం రాత్రి ఆదిలాబాద్ కు తరలిస్తున్నారు. కామారెడ్డి జిల్లా సరిహద్దులోని బిక్కనూర్ మండలం రామేశ్వరం పల్లి వద్ద అంబులెన్స్ ను కాశీకి వెలుతున్న ప్రైవేట్ టూరిస్ట్ బస్ స్పీడ్ గా వెనుక నుంచి డికోట్టింది. ఈ ప్రమాధంలొ అంబులెన్స్ నుజ్జు నుజ్జు కాగా అందులో ఇరుక్కుని

సలేహ భాను (60), అంబులెన్స్ డ్రైవర్ షేక్ సర్దార్ (35) అక్కడికక్కడే దుర్మరణం చెందగా సలేహ భాను భర్త సైఫుల్లా ఖాన్ కు కాలు విరిగి తీవ్ర గాయాలు అయ్యాయి. బిక్కనూర్ పోలీసులు సమాచారం అందగానే అక్కడికి చేరుకుని క్షతగాత్రున్ని కామారెడ్డి జిజిహెచ్ కు తరలించారు. డెడ్ బాడిలను పోస్ట్ మార్టం కోసం తరలించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. కేసు నమోదు చేసి బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. మీతి మిరిన వేగం జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాధానిాకి కారణమని తెలిసింది.
