29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

బహిరంగ సభ ప్రదేశాలను పర్యవేక్షించిన సీపీ

Must read

📰 Generate e-Paper Clip

 

కందకుర్తి, బతుకమ్మ :

 

కందకుర్తిలో కేశవ స్ఫూర్తి మందిర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆర్.ఎస్.ఎస్ చీఫ్ డా.మోహన్ రావు భగవత్ విచ్చేస్తున్న సందర్భంగా విగ్రహ ప్రతిష్టాపన, బహిరంగ సభ తదితర ప్రదేశాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య శుక్రవారం క్షుణ్ణంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ సభా స్థలంలో పటిష్ట బందోబస్తు, కేంద్ర పారా మిలటరీ, రాష్ట్రస్థాయి బలగాలు, 6 క్యూఆర్టి టీమ్స్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది జరగకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు కలవకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని ఆయనన్నారు. దాదాపు 400 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ పరిశీలనలో బోధన్ ఎసిపి శ్రీనివాస్, బోధన్ రూరల్ సిఐ విజయబాబు, రెంజల్ ఎస్సై చంద్రమోహన్, బోధన్ రూరల్ ఎస్సై మచ్చందర్ రెడ్డి, ఎడపల్లి ఎస్సై రమ, కేశవనంద భారతి ట్రస్ట్ ప్రెసిడెంట్ చామకూరి సుధాకర్ రెడ్డి, ప్రచారక్ శివకుమార్ తెలంగాణ ప్రచారక సహకార, మల్లికార్జున్ కేశవ్ నంద భారతి మెంబర్ సుబోర్ కాకాని తదితరులు పాల్గొన్నారు.

 

CP monitored public meeting places

More articles

Latest article