29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

తాగునీటి కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నాం

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

వేసవిలో జిల్లాలో ఎక్కడ కూడా తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తుగానే చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు. మారుమూల నివాస ప్రాంతాలకు సైతం రక్షిత మంచి నీటిని అందించేందుకు వీలుగా ఎడపల్లి మండలం జానకంపేట వద్ద ఏర్పాటు చేసిన ఆన్లైన్ బూస్టర్ సిస్టమ్ ను కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం సందర్శించారు. దీని పనితీరు, ప్రయోజనాల గురించి గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులను అడిగి తెలుసుకున్నారు. చిట్టచివరన ఉండే ఆవాసాలకు కూడా తాగునీరు చేరుకునేందుకు ఈ విధానం దోహదపడుతుందని అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అనంతగిరి, పోచారం గ్రామాలకు సైతం తాగునీటి సరఫరా కోసం ఇదేతరహా ఏర్పాట్లు చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రతి ఆవాస ప్రాంతానికి రక్షిత మంచి నీరు సరఫరా అయ్యేలా పక్కాగా పర్యవేక్షణ చేస్తున్నామని అన్నారు. కలెక్టర్ వెంట ఆర్.డబ్ల్యూ.ఎస్ ఈ.ఈ లు రాకేష్, స్వప్న తదితరులు ఉన్నారు.

 

We are taking steps to prevent drinking water shortage in the district.
We are taking steps to prevent drinking water shortage in the district.

More articles

Latest article