నిజామాబాద్ సిటీ, బతకమ్మ : గత తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 81, 85 ప్రకారం 61 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ వారసులకు ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం త్వరతగతిన నియామక ఉత్తర్వులు ఇవ్వాలని వీఆర్ఏ వారసులు గంగమల్లు డిమాండ్ చేశారు.61 ఏళ్ల పైబడిన వీఆర్ఏ వారసులు తమ సమస్యలపై గురువారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది 12 సంవత్సరాలుగా 61 సంవత్సరాలు దాటిన వీఆర్ఏ వారసులము తామని, ఉన్నత విద్యార్హతలు కలిగి ఉండి ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకుని ప్రజల్లోకి తీసుకుపోవడానికితమ వంతు ఎంతో కృషి చేస్తున్నామన్నారు. అయితే జీవో వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు 61 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏలు 265 మంది మరణించారని, అలాగే 25 మంది వారసులు కూడావివిధ కారణాలతో మృతి చెందారని అన్నారు. అయితే గత 14 నెలలుగా 2005 మంది వీఆర్ఏలు చేయవలసిన విధులను కేవలం 3797 మంది మాత్రమే నిర్వహిస్తున్నామన్నారు. వీఆర్ఏ వారసులకు నియామక పత్రాలు ఉత్తర్వులు ఇవ్వనందున తమ కుటుంబాల ఆర్థిక పరిస్థితి అకమ్య గోచరంగా తయారైందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే మానసికంగా కూడా ఎంతోమంది కుంగిపోవడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం 61 ఏళ్లు పైబడిన వీఆర్ఏ వారసులకు త్వరత గతిన నియామక ఉత్తర్వులు జారీ చేయాలని వారు కోరారు. బోధన్ డివిజన్అధ్యక్షుడు కరుణాకర్, నిజామాబాద్ డివిజన్ అధ్యక్షుడు మోహన్, ఆర్మూర్ డివిజన్ ఉపాధ్యక్షుడు లక్ష్మణ్, నాయకులు అబ్బులు తదితరులు పాల్గొన్నారు.
