29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

కేంద్ర ప్రభుత్వం దొంగ చాటుగా ఈ చట్టాన్ని తీసుకువచ్చింది

Must read

📰 Generate e-Paper Clip

 

. . .  వాలిడేషన్ ఆఫ్ పెన్షన్ చట్టాన్ని రద్దు చేయాలని ధర్నా

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

కేంద్ర ప్రభుత్వం దొంగచాటుగా వాలిడేషన్ ఆఫ్ పెన్షన్ చట్టం తీసుకొచ్చిందని, దీని మూలంగా పాత పెన్షనర్లని చెప్పి వారికి డి ఎ, పే రివిజన్ జరగదని ఈ రోజున్న అధిక ధరలకు, వైద్యానికి పెన్షనర్లు ఆర్థికంగా తట్టుకోలేక జీవనం కొనసాగిస్తున్నారని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ జనరల్ కే రామ్మోహన్ రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం మార్చి 25న తీసుకొచ్చిన వాలిడేషన్ ఆఫ్ పెన్షన్ చట్టాన్ని రద్దు చేయాలనీ డిమాండ్ చేస్తూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు ఇన్ కమ్ టాక్స్ ఆఫీస్ నిజామాబాద్ ముందు బుధవారం పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ లు అత్యధికంగా హాజరై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘ నాయకులు ప్రతాప్ రెడ్డి, హుస్సేన్, బాల దుర్గయ్య, గంగాధర్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం నాయకులు లావు వీరయ్య చంద్రశేఖర్, డి లక్ష్మీనారాయణ, పుష్పవల్లి, మస్తాన్ వలి, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article