రుద్రూర్, బతుకమ్మ :
రుద్రూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ గా నియామకమైన కర్క అశోక్ కు, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా నియామకమైన పత్తి రాముకు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరి చంద్రశేఖర్, పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, ఉప సర్పంచ్ షేక్ నిస్సార్, మాజీ జడ్పిటీసి నారోజి గంగారాం, పట్టేపు రాములు, మంత్రి గంగారాం, నాయకులు తోట సంగయ్య, కుర్మాజీ సాయిలు, అడప శంకర్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
