25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

లక్ష్మీ గోదా సమేత వేంకటేశ్వర స్వామిని వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం

Must read

📰 Generate e-Paper Clip

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

తెలుగు నూతన సంవత్సరాది “పరాభవ” నామ ఉగాది పండుగ సందర్భంగా బీర్కూర్ మండలం తిమ్మాపూర్, బాన్సువాడ గ్రామీణ మండలం ఇబ్రహీంపేట్ గ్రామాల్లో గల లక్ష్మీ గోదా సమేత వేంకటేశ్వర స్వామిని వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తిమ్మాపూర్ ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన ఉగాది పండుగ వేడుక, పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. బాన్సువాడ గ్రామీణ మండలం ఇబ్రహీంపేట్ గ్రామంలో కొన్ని దశాబ్దాల తర్వాత లక్ష్మీ గోదా సమేత వేంకటేశ్వర స్వామి కొండ చుట్టూ ఉగాది పండుగ సందర్భంగా జరిగే గిరి ప్రదక్షణ పునః ప్రారంభం చేశారు. గత కొన్ని దశాబ్దాల క్రితం వెంకటేశ్వర స్వామి కొండ చుట్టూ ఎడ్ల బండ్లతో గిరి ప్రదక్షణ సంబరంగా జరిగేది. చుట్టూ ప్రక్కన ఉన్న గ్రామాలనుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనేవారు. కాలక్రమేన మరుగున పడింది. తిరిగి గురువారం మాధవానంద స్వామి వారి సలహాలు, సూచనల మేరకు పోచారం ఆధ్వర్యంలో పునః ప్రారంభం గిరి ప్రదక్షణ చేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ ప్రజలందరూ ఆనందమయంగా ఉండాలని, అద్భుతమైన విజయాలు అందుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ తెలుగు నూతన సంవత్సర “పరాభవ” నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోచారం దంపతులు పుష్ప, పోచారం శంభురెడ్డి,  ఆలయ కమిటీ సభ్యులు, బీర్కూర్, బాన్సువాడ ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

 

MLA Pocharam visited Lord Venkateswara along with Lakshmi Goda

More articles

Latest article