లక్ష్మీ గోదా సమేత వేంకటేశ్వర స్వామిని వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం
బాన్సువాడ, బతుకమ్మ : తెలుగు నూతన సంవత్సరాది "పరాభవ" నామ ఉగాది పండుగ సందర్భంగా బీర్కూర్ మండలం తిమ్మాపూర్, బాన్సువాడ గ్రామీణ మండలం ఇబ్రహీంపేట్ గ్రామాల్లో గల లక్ష్మీ గోదా సమేత వేంకటేశ్వర స్వామిని వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తిమ్మాపూర్ ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన ఉగాది పండుగ వేడుక, పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. బాన్సువాడ గ్రామీణ మండలం ఇబ్రహీంపేట్ గ్రామంలో కొన్ని దశాబ్దాల తర్వాత లక్ష్మీ గోదా సమేత వేంకటేశ్వర స్వామి కొండ చుట్టూ...