28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఫిట్ ఇండియా ను తయారు చేయడమే ముఖ్య ఉద్దేశ్యం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . మేరా యువభారత్ ఆధ్వర్యంలో బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

నేటితరం యువత అన్ని రంగాల్లో రాణిస్తూ ఫిట్ గా ఉంటూ ఫిట్ ఇండియాను తయారు చేయడమే ముఖ్య ఉద్దేశమని, ప్రపంచంలో అత్యంత యువశక్తి కలిగిన దేశం భారతదేశం అలాంటి యువతను సన్మార్గంలో నడిపించడమే మేరా యువ భారత్ యొక్క ముఖ్య లక్ష్యం అని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ సునీల్ రాథోడ్ అన్నారు. మేరా యువభారత్ ఆధ్వర్యంలో బీర్కూర్, నసురుళ్లబాద్ మండల లోని జ్యోతిబాపూలే బీసీ గురుకుల విద్యాలయం, గిరిజన బాలికల గురుకుల విద్యాలయం దుర్కి లో గురువారం బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ 2025- 26 ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హజరై మాట్లాడుతూ మేరా యువభారత్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతి యువకుల్లో క్రీడా నైపుణ్యాలను అలాగే సామాజిక సేవా భావాన్ని,లీడర్ షిప్ క్వాలిటీస్ లను పెంపొందించడానికి ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఈ బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ ను నిర్వహించామన్నారు. అందులో అమ్మాయిలకు కబడ్డీ, అబ్బాయిలకు వాలీబాల్, అమ్మాయిలు అబ్బాయిలకు ఇద్దరికీ వేరువేరుగా 100 మీటర్ల పరుగు పందాలు, చెస్ పోటీలు టాగ్గాఫ్ వార్, స్కిప్పింగ్ పోటీలను నిర్వహించి గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను సర్టిఫికెట్లను అందజేశారు. గెలుపొందిన వారికి త్వరలో జిల్లా స్థాయిలు క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ ఇంచార్జ్ గోపాల్, ఐశ్వర్య, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

 

The main objective is to create a Fit India.

More articles

Latest article