26.2 C
Hyderabad
Monday, August 3, 2026

అనుమతి లేకుండా అడ్మిషన్స్ చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్ ఐఎఎస్ కి పీడీఎస్ యు వినతి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

నిజామాబాద్ రూరల్ మండల పరిధిలో ప్రభుత్వ అనుమతులు లేకుండా సీబీఎస్ఈ పేరుతో నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో అడ్మిషన్స్ చేపడుతున్నారని, వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ లో డైరెక్టర్ పాఠశాల విద్యాశాఖ డా.ఇ.నవీన్ నికోలస్ ఐఏఎస్ కి మంగళవారం పీడీఎస్ యూ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్ యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా రూరల్ మండలం కేశాపూర్ గ్రామ రోడ్ లో సీబీఎస్ బ్రాంచ్ పేరుతో బిల్డింగ్ నిర్మాణం జరుగుతుందని, నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ సీబీఎస్ క్యాంపస్ కి ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతి లేకుండానే అడ్మిషన్స్ చేపడుతున్నారని అన్నారు. బిల్డింగ్ ఇంకా నిర్మాణ దశలో ఉందని, స్టాఫ్ సెలెక్షన్స్ జరగలేదని, ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మోస పూరిత ప్రకటనలతో లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని, కావున వెంటనే నారాయణ విద్యాసంస్థలపై చర్యలు చేపట్టాలని, విద్యార్థుల భవిష్యత్ ను కాపాడాలని వారు కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా అనుమతులు లేని నారాయణ స్కూల్స్ ను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ యూ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పి.మహేష్, పొడపంగి నాగరాజు, పీడీఎస్ యూ రాష్ట్ర నాయకులు కె ఝాన్సీ, తీగల శ్యామ్, గ్రేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శి యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article