30.9 C
Hyderabad
Monday, August 3, 2026

ఎంపీ అర్వింద్ కృషితో కేంద్రీయ విద్యాలయాల్లో అదనపు సెక్షన్లు మంజూరు

Must read

📰 Generate e-Paper Clip

 

.  .  .  నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం సైతం

 

.  . .  మరింత పెరగనున్న సిబ్బంది

 

.  . . హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా వాసులు

 

నిజామాబాద్, బతుకమ్మ : 

 

నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు అర్వింద్ ధర్మపురి నిరంతర కృషి ఫలితంగా బోధన్, నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయాల్లో అదనపు సెక్షన్లు మంజూరు అయ్యాయి. కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కెవిఎస్) 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి విడుదల చేసిన ఆదేశాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకోబడింది.ఈ నిర్ణయంతో బోధన్ కేంద్రీయ విద్యాలయంలో 2వ తరగతి నుండి 5వ తరగతి వరకు అదనపు సెక్షన్లు, నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయంలో 3వ తరగతి నుండి 5వ తరగతులకు అదనపు సెక్షన్లు ఏర్పాటు చేయబడనున్నాయి. అంతేకాకుండా నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం(సైన్స్)కి సైతం అనుమతి లభించింది. దీంతో తరగతికి 40 మంది చొప్పున మొత్తం సుమారు 320 మంది విద్యార్థులకు సీబీఎస్ ఈ విధానంలో నాణ్యమైన విద్య అందుబాటులోకి రానుంది.అదేవిధంగా, రెండు కేంద్రీయ విద్యాలయాల్లో అదనపు సిబ్బంది నియామకానికి మార్గం సుగమం కానుంది.ప్రాంతంలో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న అడ్మిషన్ సమస్యలకు కూడా ఉపశమనం కలిగించనుంది. మరింత మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా మార్గం సుగమం అవుతుంది.ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ అదనపు సెక్షన్ల మంజూరుకు కేంద్ర మంత్రి కి, ఉన్నతాధికారులకి గతంలోనే విన్నవించానని, ఈ సంవత్సరం నుండి అదనపు సెక్షన్లు మంజూరవడం ఆనందంగా ఉందన్నారు. ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించడం నా ప్రాధాన్యత అని అంటూ, కేంద్రీయ విద్యాలయాల్లో సౌకర్యాల విస్తరణ కోసం నా ప్రయత్నాలు కొనసాగుతాయని తెలిపారు. జిల్లా ప్రజలు, తల్లిదండ్రులు ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ ఎంపీ అర్వింద్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

 

More articles

Latest article