27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

సేవ్ లైవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10 బ్రీత్ ఎనలైజర్స్ అందజేత 

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ క్రైం , బతుకమ్మ  : 

 

జాతీయ రోడ్డు 44 పై తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో సేవ్ లైవ్ ఫౌండేషన్ సభ్యులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయిచైతన్య కు 10 బ్రీత్ ఎనలైజర్స్  అందజేశారు. నిజామాబాద్ జిల్లాలో జాతీయ రహదారి 44 పై పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు, వెర్టీస్ ఫౌండేషన్ సహకారంతో , ఢిల్లీకి చెందిన సేవ్ లైవ్ ఫౌండేషన్ సహాయంతో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో  మంగళవారం సీపీ  సాయి చైతన్యకు10 బ్రీత్ ఎనలైజర్స్ అందజేశారు. ఈ సందర్భంగా సీపీ  మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని గుర్తించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, రహదారి భద్రతను పటిష్టం చేయడం జరుగుతుందని , జాతీయ రహదారి 44 లో  హైదరాబాద్-నిజామాబాద్ మధ్య గల ఎన్ హెచ్ -44 రహదారిపై ప్రమాదాల నివారణకు ఈ ఫౌండేషన్ నిరంతరం కృషి చేస్తోందన్నారు.బ్రీత్ ఎనలైజర్స్ ద్వారా వాహనాదారును తనిఖీలు నిర్వహించడం వలన రోడ్డు ప్రమాదాల సంఖ్యను నివారించవచ్చని, రహదారులపై మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.ఈ సందర్భంగా అదనపు డీసీపీ ( అడ్మిన్ ). బస్వారెడ్డి , సేవ్ లైఫ్ ఫౌండేషన్ అసిస్టెంట్ మేనేజర్ నూర్ కేతర్పాల్ , ఈ-డార్ మేనేజర్  వర్ష , ట్రాఫిక్ ఏసిపి  మస్తాన్ అలీ , ట్రాఫిక్ సిఐ  ప్రసాద్ , రిజర్వ్ ఇన్స్పెక్టర్ ట్రాఫిక్ విభాగం శ వినోద్  తదితరులు పాల్గొన్నారు.

 

 

More articles

Latest article