29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ధర్నాను నిర్విర్యం చేయడం సరైనది కాదు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . జిలా అధ్యక్షురాలు కైరి దేవ గంగు

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

శాంతియుతంగా హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద తమ సమస్యలను పరిష్కరించాలని ధర్నా నిర్వహించేందుకు వెళ్లే అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి ధర్నాను నిర్వీర్యం చేయడం సరైంది కాదని జిల్లా అధ్యక్షురాలు కైరి దేవ గంగు అన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్ వాడీలు తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్లకుండా పోలీసులు అంగన్ వాడీలను సోమవారం ఉదయం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు మాట్లాడుతూ చలో హైదరాబాద్ కార్యక్రమంలో ఎమ్మెల్యేలను, మంత్రులను కలిసి అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్ ల సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందించాలని నిర్ణయించి చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని తలపెట్టామన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అంగన్ వాడీల సమస్యలు పరిష్కరించనట్లయితే ఈ నెల 23న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ ల ముట్టడి చేస్తామని తెలిపారు. ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అంగన్ వాడీలకు రూ.18 వేల గౌరవ వేతనాన్ని అందించాలని, 2026 ఎడ్యుకేషన్ పాలసీని సవరించాలని, అలాగే ప్రీ ప్రైమరీ విద్యను అంగన్ వాడీ కేంద్రాలలో కొనసాగించాలని డిమాండ్ చేసారు. ఎన్.ఈ.పి 2020 చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అంగన్ వాడీ హెల్పర్స్ అధ్యక్షురాలు కైరి దేవగంగు, జ్యోతి, చంద్ర కల, ప్రేమలత, అంగన్ వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు

More articles

Latest article