. . . ఏడీఈ కన్స్ట్రక్షన్ తోట రాజశేఖర్
ఎడపల్లి, బతుకమ్మ :
గ్రామాలలో, పట్టణాలలో అంగన్ వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్ సరఫరా అమలు చేస్తున్నట్టు ఏడీఈ కన్స్ట్రక్షన్ తోట రాజశేఖర్ అన్నారు. దాంట్లో భాగంగా ఎడపల్లి మండల కేంద్రం లోని అంగడి బజార్ లో గల అంగన్ వాడీ కేంద్రంలో సోమవారం ఉచిత విద్యుత్ మీటర్ అమర్చి విద్యుత్ సరఫరాను అందించారు. బోధన్ డివిజన్లో 129 అంగన్ వాడీ కేంద్రాలలో ఉచిత విద్యుత్ సౌకర్యం కనెక్షన్ ఇస్తున్నామని, చిన్నారులకు అంగన్ వాడీ సెంటర్లో మెరుగైన వాతావరణం కల్పించడానికి ఈ సౌకర్యం కల్పిస్తున్నట్టు ఆయన తెలిపారు. దీంతో చిన్నారులకు ఉక్కపోతతో ఉపశమనం లభించనుందన్నారు. ఈ ఉచిత విద్యుత్ కనెక్షన్ ప్రభుత్వ స్వంత భవనాలలో ఉన్న వాటితో పాటు కిరాయి భవనాల్లో నడుస్తున్న అంగన్ వాడీ కేంద్రాలకు సైతం ఏర్పాటు చేయబోతున్నామని ఏడిఈ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడిఈ ఆపరేషన్ ఎడపల్లి పిల్లమర్రి ప్రభాకర్, ఏఈ కన్స్ట్రక్షన్ ఆర్ సుమిత, ఏఈ ఆపరేషన్ ఎడపల్లి కిషోర్ రెడ్డి, అంగన్వాడి టీచర్ రాజేశ్వరి, స్థానిక సిబ్బంది పాల్గొన్నారు.