రుద్రూర్ బతుకమ్మ :
రుద్రూర్ మండల కేంద్రంలోని ఠాణంపల్లి గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సోమవారం పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా 98 ఆవులు, గేదెలకు టీకాలు వేయడం జరిగిందని పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ కుమార్ తెలిపారు. ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను పశువుల పెంపకం దారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొండలవాడి శంకర్, పశువైద్య సిబ్బంది, పశువుల పెంపకం దారులు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.