24 C
Hyderabad
Sunday, August 2, 2026

ఘనంగా మొల్లమాంబ జయంతి వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . మహిళా ప్రతిభకు విశిష్ట రత్న పురస్కారాలు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా శాలివాహన ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కవయిత్రి కుమ్మర మొల్లమాంబ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు డాక్టర్ మరిపల్లి భూపతి అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో గల తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ భవనంలో ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో వివిధ రంగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళా ఉద్యోగులకు “ కవయిత్రి మొల్లమాంబ విశిష్ట రత్న పురస్కారం” అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా స్పోర్ట్స్ అండ్ యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ శెలి బెల్లాల్ మాట్లాడుతూ కవయిత్రి మొల్లమాంబ సాహిత్య సేవలను కొనియాడారు. మహిళలు సమాజంలో తమ ప్రతిభను చాటుతూ ముందుకు రావడం గర్వకారణమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన సుమారు 200 మంది కుమ్మరి ఉద్యోగులు పాల్గొన్నారు. అలాగే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మూడపల్లి సాయి కుమార్, జిల్లా అధ్యక్షులు వీరప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డుపల్లి నాగేశ్వరరావు, దత్తు, రైల్వే గంగాధర్, బుచ్చయ్య, పోచయ్య, అవునూరి ప్రమోద్, ఆర్మూర్ దత్తాత్రేయ, కుమ్మరి రాజు, జిల్లా కోశాధికారి హనుమాన్లు, మహిళా అధ్యక్షురాలు వల్లభాపురం సుష్మ, మహిళా ప్రధాన కార్యదర్శి మోతుగూరు లక్ష్మీ, తొడిశెట్టి గంగాధర్, కానుగుల శ్రీనివాస్, వినయ్, వేణుగోపాల్, లింబాద్రి, జైపాల్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article