. . . కారుతో డికోట్టి గొడ్డళ్లతో నరికి ఫ్యాక్షన్ తరహా మర్డర్
నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి దారుణ హత్యకు గురయ్యారు. సమీప బంధువు కారుతో ఢీకొట్టి గొడ్డలితో నరికి దారుణంగా హతమార్చాడు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్న ఇమ్మడి గోపి బుధవారం రాత్రి సొంత గ్రామం గౌరారం నుంచి లింగాపూర్ కారులో వెళ్తుండగా దారికాచి మరో కారుతో ఢీకొట్టి, గాయాలతో బయటకు వచ్చిన ఇమ్మడి గోపిని దారుణంగా గొడ్డళ్లు కత్తులతో నరికి హత్య చేశారు. అనంతరం నేరుగా ఇందల్వాయి పోలీసుల ముందు లొంగిపోయాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.. ఇమ్మడి గోపి ని దారుణంగా హత్య చేసింది సొంత అక్క కొడుకు అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. గోపి హత్యలో మరికొందరి ప్రమేయం ఉండవచ్చు అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇమ్మడి గోపి ఓకప్పటి పిపుల్స్ వార్ ఎల్ జి ఎస్ డిప్యూటీ కమాండర్……
ఉమ్మడి జిల్లా లో ని ధర్పల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన ఇమ్మడి గోపి పీపుల్స్ వార్ నక్సలైట్ గా సుపరిచితుడు. అప్పట్లో సిర్నాపల్లి దళంలో పనిచేసినట్లు తెలిసింది.ఆనాడు ఎల్ జి ఎస్ డిప్యూటీ కమాండర్ గా పనిచేస్తూ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఇటివల పంచాయతీ ఎన్నికల్లో అతని భార్య హేమలత గౌరారం సర్పంచ్ గా ఎన్నికయ్యారు. గోపి గౌరారం ఎంపీటీసీగా గెలుపొంది బీఆర్ఎస్ హయాంలో ఇందల్వాయి మండల పరిషత్ అధ్యక్షుడిగా పనిచేశారు. బి ఆర్ ఎస్ లో మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కు ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. ఈటల రాజేందర్ బి ఆర్ ఎస్ కు రాజీనామా చేయగా గోపి కూడా పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో భూపతి రెడ్డి గెలుపులో కీలకంగా వ్యవహరించారు. కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడిగా చలామణి అవుతున్న ఇమ్మడి గోపి హత్యోదంతం అధికార పార్టీలో కలవరం లో రేపింది. ఇమ్మడి గోపి ఎంపీపీ గా ఉన్నా ఇందల్వాయి మండల కేంద్రంలో భూవివాదంలో మహిళపై దాడి చేసిన వ్యవహారం సంచలనం రేపింది. ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి బీసీ సామాజిక వర్గం నేతగా ఎదిగిన అనుహ్యంగా హత్యకు గురి కావడం సంచలనం రేపింది..
అల్లుడే కాల యముడు…
ఇమ్మడి గోపి అతని మేనల్లుడు ( సొంత అక్క కొడుకు) సతీష్ కు ఒకరు అంటే ఒకరికి పడదు. ఇటివల పంచాయతీ ఎన్నికల్లో సతీష్ కూడా గౌరారం సర్పంచ్ గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దానికి తోడు లక్షల రూపాయల వివాధం ఉన్నట్టు తెలిసింది. బుధవారం ఉదయం సొంత గ్రామంలో బోరు విషయంలో ఇమ్మడి గోపికి సురేష్ కు మధ్య గొడవ జరిగినట్లు తెలిసింది. అది పెద్దగా మారి కక్ష్య పెంచుకుని పథకం ప్రకారం ఇమ్మడి గోపిని హత్య చేసినట్లు ప్రాథమికంగా తెలిసింది. ఇమ్మడి గోపి అధికార పార్టీ నాయకుడు కావడంతో పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఇమ్మడి గోపి హత్యలో సురేష్ తో పాటు మరికొంతమంది ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దారికాచి కారుతో డి కొట్టి అచ్చం ఫ్యాక్షన్ తరహలో జరిగిన మర్డర్ గురించి క్రైమ్ సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇమ్మడి గోపి హత్య నేపథ్యంలో గ్రామంలో భారీ బందోబస్తు తో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.
