27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఆపద మిత్ర వాలంటీర్లకు శిక్షణ

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సర్టిఫికెట్ లు, ఐ.డీ కార్డులు పంపిణీ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆపద మిత్ర వాలంటీర్లకు బుధవారం న్యాక్ భవనంలో ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు కొనసాగిన ఈ శిక్షణ కార్యక్రమంలో ఆపద మిత్ర వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఫైర్, ఇరిగేషన్, ఫిషరీస్, వైద్యారోగ్య శాఖల అధికారులు హాజరై ప్రకృతి విపత్తుల సమయం లో తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి వాలంటీర్లకు శిక్షణ ఇచ్చారు.

 

Training for disaster relief volunteers

 

శిక్షణలో పాల్గొన్న వాలంటీర్లకు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ చేతుల మీదుగా సర్టిఫికెట్స్, ఐ.డీ కార్డులు, హ్యాండ్ బుక్ లు అందజేసారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ విపత్తుల విభాగం పర్యవేక్షకుడు శ్రీనివాస్ రావు, అగ్నిమాపక శాఖ అధికారి పరమేశ్వర్, ఫిషరీస్ ఏ.డీ ఆంజనేయస్వామి తదితరులు పాల్గొన్నారు.

 

Training for disaster relief volunteers

More articles

Latest article