27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

రేవంత్ రెడ్డి మాటలకు ముమ్మాటికీ జీరో విలువ

Must read

📰 Generate e-Paper Clip

 

. . . శాసనసభలోనూ మందబలంతో బుల్డోజర్ టాక్టిక్స్‌ను ప్రయోగం

 

. . . ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధతకు ప్రైవేట్ బిల్లు పెట్టి కాంగ్రెస్ మద్ధత్తు కోరుతాం

 

. . . వెలుగుమట్ల, మూసీ బాధితుల తరపున అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తాం

 

. . . బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడేంట్ కల్వకుంట్ల తారాక రామారావు

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

మేము మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు. మూసీలో జరిగే లక్షల కోట్ల రూపాయల అవినీతికి వ్యతిరేకం. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్‌ను జీరో వ్యాల్యూ చేయడం కాదు, అసలు జీరో వ్యాల్యూ ఎవరికైనా ఉన్నది అంటే అది రేవంత్ రెడ్డికే అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారాక రామారావు అన్నారు. మంగళవారం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్‌లో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఓరియంటేషన్ సమావేశం ముగిసిన అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ… ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న మూడవ బడ్జెట్ సమావేశాలకు అత్యంత ప్రాధాన్యత ఉందని అన్నారు. ఇప్పటికే సగం ప్రభుత్వ పదవీ కాలం అయిపోయింది. హామీల అమలులో ప్రజలు ఇచ్చిన వ్యవధి అయిపోయింది. వారి హామీల అమలు వైఫల్యాన్ని, మోసాన్ని ఎండగట్టేందుకు ఈ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపైన ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాల పైన ఈ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపైన మా పార్టీ సీనియర్ నేతలు మధుసూదనాచారి, బండ ప్రకాష్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి తదితరులు చర్చించాం అన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటినా అసెంబ్లీలో ఏ కమిటీలను వేయడం లేదు.పబ్లిక్ అకౌంట్స్ కమిటీని మా పార్టీ నుంచి ద్రోహం చేసి పోయిన వ్యక్తికి ఇచ్చారు.

 

Revanth Reddy's words have absolutely zero value.

 

ఒక్క సెలెక్ట్ కమిటీ లేదు, స్టాండింగ్ కమిటీ లేదు, పిటిషన్స్ కమిటీ లేదు. ఇలా డెప్యూటీ స్పీకర్ కూడా శాసనసభలో లేరు. కేవలం అనివార్యంగా శాసనసభ సమావేశాలను నడిపించాల్సి వస్తుంది కాబట్టి ప్రభుత్వం బలవంతంగా నడిపిస్తున్నది అన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ బుల్డోజర్లను పంపి ఇళ్లను కూలగొడుతున్న తీరుగానే శాసనసభలోనూ మందబలంతో బుల్డోజర్ టాక్టిక్స్‌ను ప్రయోగిస్తున్నదియ అని కేటిఆర్ ఆరోపించారు. ఆరు గ్యారెంటీలకు మొదటి క్యాబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకొని చట్టబద్ధత కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ రెండున్నర సంవత్సరాల తర్వాత కూడా చట్టబద్ధత పక్కన పెట్టి కనీసం అమలు కూడా చేయడం లేదు. అందుకే ఈ సమావేశాల్లో ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లును మా పార్టీ తరపున తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. మేము పెట్టే ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాము అన్నారు. రాహుల్ గాంధీకి వెయ్యి కోట్లు ఇస్తామని చెప్తున్న రేవంత్ రెడ్డి రైతన్నలకు ఇవ్వాల్సిన రైతు బంధును మాత్రం పక్కన పెట్టాడు అని పెర్కోన్నారు. ఖమ్మంలో ప్రభుత్వ దాష్టీకం వల్ల ఇళ్లు కోల్పోయిన ఖమ్మం వెలుగుమట్ల తరపున, మూసీ బాధితుల తరపున, పేద దళిత, గిరిజన ప్రజల కోసం ఈ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ పైన ప్రభుత్వాన్ని నిలదీస్తాం.

అసెంబ్లీలో ప్రభుత్వం చేస్తున్న అంకెల గారడీని, లేని అప్పులను ఉన్నవిగా చూపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ అబద్ధాలను అంకెలతో సహా ఎండగట్టాలని ఈరోజు జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ వర్గాలకు ఇస్తామన్న నిధులు ఎందుకు కేటాయించలేదో నిలదీస్తాం. రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన చేయడం లేదు, కేవలం ఢిల్లీకి డబ్బులు పంపించడం కోసమే మూసీ ప్రాజెక్టును చేపడుతున్నాడు. డే ఎకానమీని నాశనం చేసిన వ్యక్తి నైట్ ఎకానమీ గురించి మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా రాహుల్ బంధు పథకాన్ని పక్కన పెట్టి రైతు బంధు కార్యక్రమాన్ని చేపట్టాలి అని కోరారు. రెండున్నర సంవత్సరాలలో ఒక్క ఇల్లు అయినా కాంగ్రెస్ పార్టీ కట్టింది అంటే నేను రాజీనామా చేస్తానని చెప్పాను, దానికి నేను ఇంకా కట్టుబడి ఉన్నాను. మేము కట్టిన ఫ్లైఓవర్లు, ఇళ్లు, ప్రాజెక్టులకు రంగులు పూసి మావి అని కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడు అని ఎద్దేవా చేశారు.

 

Revanth Reddy's words have absolutely zero value.

More articles

Latest article