29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఆచన్ పల్లిలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీపీ

Must read

📰 Generate e-Paper Clip

 

బోధన్, బతుకమ్మ :

 

బోధన్ పట్టణంలోని ఆచన్ పల్లిలో అప్నా ఫంక్షన్ హాల్ లో ముప్తి అతిక్ హైమద్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఇఫ్తార్ విందు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ పోలీస్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. మౌలానా సయ్యద్ అబ్దుల్ బాకీ నిర్వహించిన దువాలో సీపీ పాల్గొని , అనంతరం ఉపవాస విరమణ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ రంజాన్ మాసం విశిష్టతను విశ్లేషణాత్మకంగా వివరించారు. రంజాన్ అనేది కేవలం ఉపవాసాల నెల మాత్రమే కాకుండా, మనస్సును పరిశుభ్రం చేసుకునే ఆత్మపరిశీలన కాలమని అన్నారు. ఉపవాసం ద్వారా నియమం, సహనం, క్రమశిక్షణ పెంపొందుతాయని, పేదల పట్ల కరుణాభావం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. దానధర్మాలు, సహనశీలత, సోదరభావం వంటి విలువలు ఈ పవిత్ర మాసంలో మరింత ఆవిష్కృతమవుతాయని చెప్పారు. అల్లా కృపతో సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, సుఖసంతోషాలు నెలకొనాలని ఆకాంక్షించారు. అలాగే అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ముందుకు సాగి బోధన్‌కు జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఎసిపి శ్రీనివాస్, సీఐలు వెంకటనారాయణ, విజయబాబు, ఎస్సైలు మచ్చేందర్ రెడ్డి, భాస్కరాచారి, మనోజ్, మహేష్, హబీబ్, మజీద్ కమిటీ సభ్యులు ఎంఐఎం ప్రెసిడెంట్ మీర్ ఇలియాస్ అలీ, కౌన్సిలర్ మునిషీర్ బాబా అడ్వకేట్ అబ్బీద్ సుఫి, కౌన్సిలర్ మీరు గౌస్, ఆసిఫ్ సుల్తాన్ మోల్ సాబ్, మహమ్మద్ ఇమ్రాన్ హుస్సేన్, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. సీపీ హాజరుకావడం పట్ల కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

 

CP attended the Iftar dinner at Achan Pally

More articles

Latest article