29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

మంగళవారం యథావిధిగా క్షవరశాలల సేవలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ బతుకమ్మ : మంగళవారం నిజామాబాద్ నగరంలో క్షవరశాలల సేవలు యధావిదగా కొనసాగుతాయని పట్టణ నాయి బ్రాహ్మణ షాప్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గడిల భూమేష్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి మంగళవారం క్షవరశాలలు (హెయిర్ కటింగ్ సెలూన్) సెలవు దినంగా పాటిస్తున్నాయని తెలుపుతూ దసరా పండుగ సందర్భంగా వినియోగదారుల సౌకర్యార్థం ఈ మంగళవారం యధావిధిగా తెరిచి ఉంటాయని ఆయన వెల్లడించారు. ఈ విషయంపై అసోసియేషన్ కార్యవర్గం చర్చించి నిర్ణయం తీసుకుందన్నారు. ఈ విషయాన్ని నగర ప్రజలు గుర్తుంచుకొని తమ సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లింగంపల్లి శ్రీనివాస్, కోశాధికారి మోతే తరుణ్ పాల్గొన్నారు.

More articles

Latest article