25.4 C
Hyderabad

బొప్పాపూర్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ  : రుద్రూర్ మండల కేంద్రంలోని బొప్పాపూర్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సోమవారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు వివిధ రకరకాల పువ్వులతో బతుకమ్మలను పేర్చి, బతుకమ్మలకు పూజలు నిర్వహించి ప్రధాన కూడలీ వద్ద బతుకమ్మలను ఒకే చోట ఉంచి బతుకమ్మ పాటలు పాడుతూ కోలాటలతో నృత్యాలు చేస్తూ బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ది కమిటీ అధ్యక్షులు పట్ల సురేష్, మాజీ జెడ్పీటీసీ నారోజీ గంగారాం, సురేందర్, లింగం, కుర్మాజి గంగారాం, సతీష్, కుర్మాజీ సాయిలు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article