మంగళవారం యథావిధిగా క్షవరశాలల సేవలు
నిజామాబాద్ సిటీ బతుకమ్మ : మంగళవారం నిజామాబాద్ నగరంలో క్షవరశాలల సేవలు యధావిదగా కొనసాగుతాయని పట్టణ నాయి బ్రాహ్మణ షాప్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గడిల భూమేష్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి మంగళవారం క్షవరశాలలు (హెయిర్ కటింగ్ సెలూన్) సెలవు దినంగా పాటిస్తున్నాయని తెలుపుతూ దసరా పండుగ సందర్భంగా వినియోగదారుల సౌకర్యార్థం ఈ మంగళవారం యధావిధిగా తెరిచి ఉంటాయని ఆయన వెల్లడించారు. ఈ విషయంపై అసోసియేషన్ కార్యవర్గం చర్చించి నిర్ణయం...