26.6 C
Hyderabad
Monday, August 3, 2026

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో పెయింటింగ్ పోటీలు

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

తెలంగాణ యూనివర్సిటీ లోని ఎన్ఎస్ఎస్ యునిట్ III ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. వుమెన్ ఎంపవర్ మెంట్  స్ట్రాంగ్ వుమెన్, స్ట్రాంగ్ నేషన్ అనే అంశంపై నిర్వహించిన ఈ పోటీలో విశ్వవిద్యాలయానికి చెందిన వివిధ విభాగాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళల సాధికారత, సమాజంలో వారి పాత్ర, వారి శక్తి, విజయాలను ప్రతిబింబించేలా విద్యార్థులు తమ చిత్రాలను గీసి సృజనాత్మకతను ప్రదర్శించారు. విద్యార్థులు రూపొందించిన చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమం విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కాలేజ్ సెమినార్ హాల్ లో జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. ఎన్. స్వామి సమన్వయం చేశారు. మహిళల గౌరవం, సమానత్వం మరియు సాధికారతపై అవగాహన పెంపొందించడమే ఈ పోటీ యొక్క ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు. ఈ పోటీలలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు వర్సిటీ ఊకులపతి ఆచార్య టి. యాదగిరిరావు, రిజిస్ట్రార్ ఆచార్య యం. యాదగిరి మరియు టి. యు. ఎన్ఎస్ఎస్ కోర్డినేటర్ ఆచార్య అపర్ణ శుభాకాంక్షలు తెలిపారు.

More articles

Latest article