అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో పెయింటింగ్ పోటీలు

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   తెలంగాణ యూనివర్సిటీ లోని ఎన్ఎస్ఎస్ యునిట్ – III ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. వుమెన్ ఎంపవర్ మెంట్ –  స్ట్రాంగ్ వుమెన్, స్ట్రాంగ్ నేషన్ ” అనే అంశంపై నిర్వహించిన ఈ పోటీలో విశ్వవిద్యాలయానికి చెందిన వివిధ విభాగాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళల సాధికారత, సమాజంలో వారి పాత్ర, వారి శక్తి, విజయాలను ప్రతిబింబించేలా విద్యార్థులు తమ చిత్రాలను గీసి సృజనాత్మకతను ప్రదర్శించారు. విద్యార్థులు రూపొందించిన...