30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

రోడ్డు పై సూచిక బోర్డులెక్కడ ?

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ప్రాణాలు పోతున్నా స్పందించని రోడ్డు నిర్మాణ సంస్థ అధికారులు

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రహదారులపై సరైన సూచిక బోర్డులు లేకపోవడం వల్ల వేగ నియంత్రణ, మలుపులు, నిర్మాణాలు, ప్రమాదకర మలుపుల గురించి తెలియక తరచుగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రుద్రూర్ – వర్ని రోడ్డు విస్తీర్ణ పనుల నేపథ్యంలో మండలంలోని అక్బర్ నగర్ రహదారి ప్రక్కన డ్రైనేజీ నిర్మాణం చేసి మధ్యలోనే పనులను నిలిపివేశారు. అక్కడ ఎలాంటి సూచిక బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో ఆ డ్రైనేజీలో పడి ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు చాలా ప్రమాదాలు జరిగాయని, ప్రాణాలు పోయినా కూడా రోడ్డు నిర్మాణ సంస్థ అధికారులు సూచిక బోర్డులు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో అనేక ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని గ్రామస్తులు వాపోయారు. రాత్రి వేళల్లో రేడియం స్టిక్కర్లు లేని బోర్డులు, మూలమలుపుల వద్ద హెచ్చరికలు లేకపోవడంతో వాహనాలు అదుపుతప్పి, బోల్తా పడి ప్రాణ నష్టం సంభవిస్తోంది. రోడ్డు పనులు జరుగుతున్నా, రేడియం స్టిక్కర్లు లేదా హెచ్చరిక లైట్లు లేని బోర్డుల వల్ల రాత్రి సమయాల్లో వేగంగా వచ్చే వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. జాతీయ రహదారుల విస్తీరణ, డ్రైనేజీ పనుల వద్ద కనీస హెచ్చరిక బోర్డులు లేకపోవడం వల్ల వాహనాలు గుంతల్లో పడటం లేదా నిర్మాణ సామాగ్రిని ఢీకొట్టడం జరుగుతోంది. ఇప్పటికైనా సంబంధిత రోడ్డు నిర్మాణ సంస్థ అధికారులు స్పందించి ప్రమాదాలు సంభవించకుండా రోడ్డుపై సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారు.

More articles

Latest article