26.2 C
Hyderabad

మనస్థాపంకు గురై ఉరివేసుకొని వ్యక్తి మృతి

Must read

📰 Generate e-Paper Clip

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

సోమేశ్వర్ గ్రామానికి చెందిన ధ్యావల్ల రాములు (26) ఉరి వేసుకొని మృతి చెందినట్లు బాన్సువాడ పట్టణ సీఐ తుల శ్రీధర్ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం మద్యంకు బానిసయి తన భార్యతో గొడవపడి ఆమెను కొట్టగా మరుసటి రోజు కూడా మళ్లీ తాగిన మైకంలో ఆమెతో గొడవపడి, కొట్టడంతో తన పుట్టింటికి వెళ్ళిపోయింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొని మృతి చెందినట్లు తెలిపారు. మృతుని తండ్రి సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

More articles

Latest article