29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఐద్వా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం ఎస్టీ గురుకుల డిగ్రీ కాలేజీలో ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్ కి ఉపన్యాసాలు, పాటల పోటీలు నిర్వహించి ఐద్వా ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి బెజుగాం సుజాత మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం 1910లో కార్ల జెట్కన్ అనే మహిళ మహిళల హక్కుల కోసం పోరాడిన ఆలోచనే మనం జరుపుకుంటున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం అన్నారు. ఇంటర్నేషనల్  కార్పొరేషన్ వర్కింగ్ ఉమెన్ సదస్సులో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కార్ల జట్కన్ ప్రతిపాదన పెట్టారని ఆమె పోరాట ఫలితమే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. అప్పటికే మహిళలందరూ ప్రపంచవ్యాప్తంగా 24 గంటల పని దినానికి వ్యతిరేకంగా 8 గంటల పని దినం కోసం పోరాటాలు ఆందోళనలో నిర్వహించారని, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8 అంటే శాలువాలు కప్పి సన్మానించడం కాదని సమాజంలో మహిళల గౌరవాన్ని పెంచడం, విలువను పెంచడం, సమాజంలో సగభాగమని గుర్తించడం, కానీ ఇప్పటికి మహిళలను రెండో పౌరురాలు గానే చూస్తున్నారన్నారు. ఒక మహిళ ఒక పురుషుడు ఒకే పని చేస్తున్నప్పుడు పురుషుడికి ఎక్కువ వేతనం ఇచ్చి మహిళకు తక్కువ వేతనం ఇస్తున్నారని, సమాజంలో సమాన పనికి సమాన వేతనం ఇచ్చి పురుషులతో సమానంగా మహిళలని కూడా  గౌరవించినప్పుడు నిజమైన గౌరవాన్ని మహిళలు పొందుతారన్నారు. మహిళలకు సమాన పనికి సమాన వేతనం ఇచ్చే వరకు ఐద్వా నిరంతర పోరాటాలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకురాలు రజియా,  నగర నాయకులు శ్రీదేవి, అమృత తదితరులున్నారు.

 

International Women's Day under the auspices of AIDWA

 

More articles

Latest article