24 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రశ్నించే మనస్తత్వం ఉంటే భావి భారత శాస్త్రవేత్తలుగా ఎదుగుతారు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్ జావిద్

 

. . . తడపాకల్ స్కూల్లో జాతీయ సైన్స్ డే

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

చిన్నప్పటి నుంచే పిల్లల్లో ఆలోచన శక్తి, ప్రశ్నించే మనస్తత్వం ఉంటే భావి భారత శాస్త్రవేత్తలుగా ఎదుగుతారని  పాఠశాల ప్రధానోపాధ్యాయులు అబ్దుల్ జావిద్ అన్నారు. శనివారం జాతీయ సైన్స్ డే సందర్భంగా తడపాకల్ జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో సర్ సివి రామన్ ఫోటోకు పూలమాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాస్త్రం అంటే కేవలం పుస్తకాలకే పరిమితం కాదని, మన రోజువారీ జీవితంలో ఉన్న ప్రతి చిన్న విషయానికీ విజ్ఞానశాస్త్రంతోనే సంబంధం ఉంటుందని తెలిపారు. తదనంతరం పాఠశాల సైన్స్ ఉపాధ్యాయులు సుధాకర్, రవి లను శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గంగాధర్, స్వప్న, దేవానంద్ గౌడ్, చక్రపాణి, ఆనంద్, విజయ, కృష్ణ ప్రసాద్, స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.

More articles

Latest article