27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

కాలేజీ భవనం పైనుంచి దూకి ఉద్యోగి ఆత్మహత్య

Must read

📰 Generate e-Paper Clip

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

కుటుంబ సమస్యల నేపథ్యంలో కాలేజీ ఉద్యోగి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం దుర్కి గ్రామ శివారులోని శ్రీ రామ్ నారాయణ కేడియా (ఎస్ఆర్ఎన్ కే) డిగ్రీ కళాశాలలో శనివారం చోటుచేసుకుంది. కాలేజీలో రికార్డ్ అసిస్టెంట్ గా పని చేస్తున్న షేక్ అహ్మద్ (60) భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు కుటుంబ సమస్యలే కారణమని తెలిసింది. షేక్ అహ్మద్ నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రాంతానికి చెందిన వాడని సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

More articles

Latest article