28.8 C
Hyderabad
Monday, August 3, 2026

దేశానికి మూలపురుషులు, ఆదిహిందువులు దళితులే

Must read

📰 Generate e-Paper Clip

అర్బన్ ఎం ఎల్ ఎ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా

నిజామాబాద్ సిటీ బతుకమ్మ :  దేశానికి మూలపురుషులు, ఆదిహిందువులు దళితులే అని అర్బన్ ఎం ఎల్ ఎ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. భారతీయ జనతా పార్టీ ఎస్సి మోర్చా అధ్యక్షులు శివప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసి దళిత మేధావుల రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు దళితులు అంటే ఆది హిందువులని,ఈ దేశానికి మూలపురుషులుగా హిందూ ధర్మ రక్షకులుగా వ్యవహారిస్తూ రామాయనాన్ని వాల్మీకి, భగవద్గీతకు సమానమైన రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ దేశప్రజలందరికి ఆదర్శం అని అన్నారు. ఢిల్లీలో ఆ మహనీయుని పేరు మీద 2 ఎకరాలలో 100 కోట్లతో గొప్ప స్మారక భవనాన్ని కూడా నిర్మించడం భారతీయులందం గర్వించదగ్గ విషయమని అన్నారు. అంతే కాదు ఈ దేశానికి ప్రథమ పౌరునిగా గౌరవించే రాష్ట్రపతి స్థానాన్ని ఒక దళితుడు రాంనాథ్ కోవిద్ కి,ఎస్టి మహిళకు ఇచ్చి గౌరవించిన పార్టీ బిజెపి అన్నారు. అంబేద్కర్ రాజకీయ నాయకులు కూడా ఈ రోజు దళితులను ఒక పావుల ఆటవస్తువులుగా ఆడుకొని వదిలేస్తున్నారని దళిత మేధావులంతా గమనించలన్నారు. బీ ఆర్ ఎస్ పార్టీ దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడు ఎకరాల భూమి దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్ అని 10 ఏళ్ళు దళితులను అన్యాయం చేసారన్నారు.. కాంగ్రెస్ పార్టీకి దళితులు అంటే ముందు నుండి చిన్న చూపే అన్నారు ఆనాడు అంబేద్కర్ ని ఓడగొట్టొందే కాంగ్రెస్ అన్నారు,మొన్న జరిగిన ఎన్నికల్లో 6 గ్యారెంటీలు, ఐదు డిక్లరేషన్లు, 420 హామీలతో తెలంగాణాలో అధికారంలోకి రావడం జరిగిందని
చేవెళ్ల SC, ST డెక్లరేషన్ పేరు మీద దళితులను పచ్చి మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ అన్నారు,అంబేద్కర్ అభయ హస్తం పేరు మీద దళితులకు 12 లక్షలు ఏమైనాయి అని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద జాగా ఉంటే 6 లక్షల ఊసే లేదన్నారు ఇండ్లు లేని దళితన్నలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు అని అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ తో పాటు మరో మూడు కార్పొరేషన్ ఏర్పాటు అని సంవత్సరానికి 700 కోట్లు అని యావత్ దళిత సమాజాన్ని మోసం చేసిందన్నారు. విద్య జ్యోతి పథకం కింద పదో తరగతి పాస్ అయితే 10వేలు, ఇంటర్ పాస్ అయితే 15 వేలు, డిగ్రీ పాస్ అయితే 25వేలు పీజీ పాస్ అయితే లక్ష రూపాయలు, ఎంఫిల్ పూర్తి చేస్తే 5 లక్షలు అని యావత్ దళిత విద్యార్తులను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అన్నారు. దళిత మేధావులు అందరు ఆలోచన చేయాలని ఒక వైపు అంబేద్కర్ మహనీయుని ముసుగులో దేశ విచ్చిన్ననికి, కుట్రలు జరుగుతున్నాయని, ఒకవైపు రాజకీయ నాయకులు దళితులను వర్గాలుగా విభజించి ఆటవస్తువులుగా ఆడుకొని వదిలేస్తున్నారని దళిత జాతిని చైతన్యం చేయాల్సిన సమయం ఆసన్నం అయిందని రామాయనాన్ని రచించిన వాల్మీకిని ఆదర్శంగా తీసుకొని, రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ ని ఆదర్శంగా తీసుకొని నిజమైన అంబేద్కర్ వారసులుగా ఈ దేశ అదిహిందువులుగా మూలపుషులుగా ఈ దేశాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషించాలని మేధావుల మౌనం ఈ దేశానికి ప్రమాదకరం అని అన్నారు ఇక్కడ ఉన్న మేధావులు అందరు దేశఐక్యతలో, అభివృద్ధిలో, మన హిందూ ధర్మ రక్షకులుగా నిలపడాలని జాతిని చైతన్యం చేయాలనీ అన్నార. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, సాయి వర్ధన్, బట్టు రాఘవేందర్,బీజేపీ SC మోర్చా నాయకులు సందీప్, సాయినాథ్, కిరణ్, మేధావులు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article