. . . దాడికి పాల్పడిన వారి పై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
. . . మహిళా న్యాయవాదికి బిజెపి పార్టీ మద్దతు
రుద్రూర్, బతుకమ్మ :
రుద్రూర్ మండల కేంద్రంలోని జేయన్సీ కాలనీలో ఓ వ్యక్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న సందర్బంగా ఓ మహిళ న్యాయవాది ఆ సంఘటన చూసి ప్రశ్నించగా, మరో వర్గానికి చెందిన వ్యక్తులు మహిళా న్యాయవాదిపై అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తు దాడికి పాల్పడ్డారని, మహిళా న్యాయవాది పై ఓ వర్గానికి చెందిన వ్యక్తులు చేసిన దాడిని నిరసిస్తూ బిజెపి నాయకులు మహిళా న్యాయవాదికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బిజెపి పార్టీ మండల అధ్యక్షులు ఆలపాటి హరి కృష్ణ, దొరబాబు మాట్లాడుతూ.. ఓ మహిళ న్యాయవాదిపై మరో వర్గానికి చెందిన వ్యక్తులు దాడి చేశారని, దాడి చేసిన వ్యక్తుల పై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. బాధిత న్యాయవాది మహిళ పై దాడి చేసిన వ్యక్తుల పై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుని వారిని వెంటనే అరెస్టు చేసి, బాధిత మహిళకు న్యాయం జరిగేలా చూడాలని పేర్కొన్నారు. బాధిత మహిళ న్యాయవాదిని పరామర్శించడానికి జిల్లా అధ్యక్షులు దినేష్ కులకర్ణి విచ్చేయాల్సి ఉండగా, ఆయనను రాకుండా పోలీసులు ముట్టడించారన్నారు. జిల్లా అధ్యక్షులు రెండు రోజుల తర్వాత అయినా కూడా రుద్రూర్ గ్రామానికి విచ్చేసి బాధిత మహిళ న్యాయవాదిని పరామర్శిస్తారని చెప్పారు. న్యాయం జరగని పక్షంలో పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, నాయకులు పార్వతి మురళి, కటికే రామ్ రాజ్, అనిల్, కుమ్మరి గణేష్, వడ్ల సాయినాథ్, హిందూ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
