నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
తెలంగాణ యూనివర్సిటీ ఉర్దూ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ మహమ్మ ద్ మూసా ఖురేషి ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ డీన్ గా నియమితులయ్యారు. వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి.యాదగిరి రావు ఆదేశాల మేరకు నియామక పత్రాన్ని యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య ఎం.యాదగిరి చేతులమీదుగా అందుకున్నారు. తరువాత ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఆర్ట్స్ డీన్ గా బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆర్ట్స్ డీన్ గా పనిచేసిన ఆచార్య కె. లావణ్య డీన్ ఆఫీస్ బాధ్యతలను ప్రొఫెసర్ మమ్మద్ మూసా ఖురేషి కి అందజేశారు. ఈ సందర్భంగా పలు డిపార్ట్మెంట్ల అధ్యాపకులు నూతనంగా భాద్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ ఖురేషిని సన్మానించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఖురేషి మాట్లాడుతూ ఆర్స్ విభాగంలో పరిశోధనకు పెద్దపీట వేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హ్యుమానిటీస్ ఫాకల్టీ తో పాటు ప్రిన్సిపాల్ ఆచార్య జి. రాంబాబు వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్. లక్షణచక్రవర్తి ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్, ఫార్మర్ డీన్ ఆచార్య కె. లావణ్య, ఆచార్య పి. కనకయ్య, డాక్టర్. ఏ. నాగరాజు, డాక్టర్. వాసంచంద్రశేఖర్, డాక్టర్. అతీఖ్ సుల్తాన్, వర్సిటీ భోదనేతర సిబ్బంది పాల్గొన్నారు.
