.. ఐదుగురిపై కేసు నమోదు
ఆర్మూర్, బతుకమ్మ:
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్ర పరిధిలోని పెర్కిట్ లో 7 నెలల చిన్నారి అమ్మకం పై ఆర్మూర్ పోలీసులు ఐదుగురు వ్యక్తులపై శనివారం రాత్రి కేసు నమోదు చేసినట్లు తెలిసింది. పెర్కిట్ కు చెందిన మైనార్టీ దంపతులకు పిల్లలు లేకపోవడంతో వారి కోసం నందిపేట్ కు చెందిన ఆ జంట 7 నెలల బాలుడి ని అమ్మినట్లు దర్యాప్తులో తెలిసిందని ఆర్మూర్ ఎస్సై గంగాధర్ వివరించారు. ఆర్మూర్ పోలీసులకు సమాచారం రావడంతో ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ లక్ష్మణ్ సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేసి, ఏఎస్ఐ విచారణ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై గంగాధర్ తెలిపారు. ఏడు నెలల చిన్నారిని కొనుగోలు చేసిన వారి నుంచి తీసుకొచ్చి జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో ఉన్న ఐసిడిఎస్ బాలల కేంద్రంలో అధికారుల సంరక్షణలో ఉంచినట్లు చెప్పారు. ఇలాంటి చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు చేయడం నేరమని, ఎవరు చేసిన ఉపేక్షించేది లేదని సదరు వ్యక్తుల పట్ల చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని ఆర్మూర్ ఎస్సై తెలిపారు.
