25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

సిండికేట్ లో దందా చేయడం లేదని పీడీఎస్ మాఫియా దాడి

Must read

📰 Generate e-Paper Clip

  •  పోలీసుల అండతో రెచ్చిపోతున్నపీడీఎస్ మాఫియా

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పీడీఎస్ మాఫియా రెచ్చిపోయింది.పోలీసులకు ప్రతినెల మామూళ్ళు ఇస్తున్నామని ధైర్యంతో పట్టపగలు దాడికి తెగబడింది. 2022 , 2023లో పీడీఎస్ దందా విషయంలో ఇద్దరు రౌడిషిటర్లు హత్యకు గురి కాగా ఒక పీడీఎస్ దందా నిర్వాహకునిపై హత్యాయత్నం జరిగింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పీడీఎస్ దందాకు సహకరించే పోలీసులు ఉన్నారన్న అండతో శనివారం పీడీఎస్ మాఫియా రెచ్చిపోయింది. సిండికేట్ కు సంబంధం లేకుండా రేషన్ బియ్యం సేకరణ విక్రయాలు చేస్తున్నారని కారణంతో మజార్ అలియాస్ చోటు, హంజల, నోమాన్ అనే యువకులపై సిద్దిఖీ, అప్సర్ అనే ఇద్దరు అన్నదమ్ములు మరికొంత మంది కలిసి దాడి చేశారు. 1వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బోధన్ రోడ్డులో గల గ్రాండ్ ప్లాజా వద్ద ఈ దాడి జరిగింది. ఈ దాడిలో హోటల్ లో బీభత్సం స`ష్టించారు. 15 మంది మూకుమ్ముడి దాడిలో గాయపడిన వారిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పీడీఎస్ మాఫియా వెనుక నిజామాబాద్ పీడీఎస్ మాఫియా హస్తం ఉందని బాధితులు వాపోయారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం రాత్రి పిడిఎస్ సిండికేట్ లో దందా చేయాలని రెండు గ్రూప్ ల మద్య చర్చలు జరిగాయి. కాని శనివారం ఉదయం ఎవ్వరికి వారు దందా చేసుకోవడంతో పథకం ప్రకారం దాడి చేసి కోట్టినట్లు బాధితులు తెలిపారు.

PDS mafia attack for not doing business in the syndicate

More articles

Latest article