27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఆర్మూర్ లోని పోలింగ్ సరళిని పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, భీంగల్ లో జరుగుతున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా బుధవారం ఆర్మూర్ లో మధ్యాహ్న సమయంలో నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పోలింగ్ బూతులలో పోలింగ్ సరళిని క్షుణ్ణంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగపరచుకోవాలని,  సిబ్బంది ఎక్కడ కూడా అలసత్వం వహించరాదని, ఓటర్లతో మర్యాదపూర్వకంగా మెలగాలని, ఎన్నికల ప్రవర్తన నియమాలను తూ.చా తప్పకుండా ప్రతి ఒక్కరూ పాటించాలని తెలియజేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయం, సంతోష్ నగర్ లోని విద్య హైస్కూల్లో పోలింగ్ బూతులను క్షుణ్ణంగా పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏసీపి వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ ఎస్ హెచ్ వో సత్యనారాయణ, ఏ.ఆర్.ఓ భూమేశ్వర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

 

 

Police Commissioner monitors polling in Armur

More articles

Latest article