27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని రాష్ట్ర నాయకులు కే రామ్మోహన్రావు అన్నారు. బుధవారం పెన్షనర్స్ భవన్లో పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెన్షనర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ డిమాండ్ చేసింది. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈపీఎస్ పెన్షనర్లకు నెలకు 9000 రూపాయలు పెన్షన్ చెల్లించాలని, సీనియర్ సిటిజన్ లకు రైల్వేలో రాయితీలు కొనసాగించాలని, సిపిఎస్ ని రద్దు చేసి ఓ పి ఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని, సార్వత్రిక హెల్త్ స్కీం అమలు చేయాలని, నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, అధిక ధరలను రద్దు చేయాలని తదితర డిమాండ్ల సాధన కోసం తాము కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు శిర్ప హనుమాన్లు, జిల్లా కార్యదర్శి ఈవిల్ నారాయణ, నిజామాబాద్ డివిజన్ అధ్యక్షుడు రాధా కిషన్, కార్యదర్శి సాంబశివరావు, జిల్లా ఉపాధ్యక్షులు ప్రసాద్ రావు పాల్గొన్నారు. రిటైర్డ్ ఉద్యోగులందరూ పాత కలెక్టర్ కార్యాలయం దగ్గర ఉన్న ధర్నా చౌక్ లో ఉదయం 10 గంటలకు హాజరుకావాలని వారు తెలిపారు.

More articles

Latest article