ఆర్మూర్ లోని పోలింగ్ సరళిని పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, భీంగల్ లో జరుగుతున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా బుధవారం ఆర్మూర్ లో మధ్యాహ్న సమయంలో నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పోలింగ్ బూతులలో పోలింగ్ సరళిని క్షుణ్ణంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగపరచుకోవాలని, సిబ్బంది ఎక్కడ కూడా అలసత్వం వహించరాదని, ఓటర్లతో మర్యాదపూర్వకంగా మెలగాలని, ఎన్నికల ప్రవర్తన నియమాలను తూ.చా...