25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

పోలింగ్ సరళిని వెబ్ ఐ.పి కెమెరాల ద్వారా వీక్షించిన పోలీస్ కమిషనర్

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, భీంగల్ పట్టణాల్లో  జరుగుతున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా బుధవారం ఉదయం పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పోలింగ్ బూతులలో పోలింగ్ సరళిని వెబ్ ఐ.పి కెమెరాల ద్వారా క్షుణ్ణంగా వీక్షించారు. ఈ ఎన్నికల సరళని వెబ్ ఐపి కెమెరాల ద్వారా వీక్షించడానికి పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్ లో 1203 వె.బ్ ఐపి కెమెరాలను ఇంటర్నెట్ అనుసంధానంతో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల నియమావళి ని ప్రతి ఒక్కరు తూ.చా తప్పకుండా పాటించాలని, ప్రజలు ఎక్కడ కూడా గుమిగూడకుండా తగు చర్యలు, భద్రత ఏర్పాట్లను పట్టిష్టపరచాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ముందస్తు సమాచారం తెలిసిన తమ పై అధికారులకు తెలియజేయాలని సూచించారు. జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, ఎలక్షన్ సెల్ ఇన్చార్జి శ్రీధర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఎస్సై ఎస్. సంతోష్ రెడ్డి, ఐటి కోర్ ఆర్.ఎస్.ఐ నిషిత్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

 

 

Police Commissioner watches polling pattern through web IP cameras

More articles

Latest article